ఇటీవలి కాలంలో మనం తినే ఆహారం అయినా, తాగే పానీయాలు అయినా అన్నీ కల్తీతో నిండిపోతున్నాయి. కారం తయారీలో ఇటుక పొడిని కలుపుతున్నారు, మసాలాల్లో చెక్క పొడిని కలిపి విక్రయిస్తున్నారు. అల్లం పేరుతో అరటితొక్కను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ఏ వస్తువును ముట్టుకున్నా కల్తీ తప్ప మరేమీ కనిపించని దయనీయ పరిస్థితి నెలకొంది.
ఇలాంటి నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన సమాజాన్ని షాక్‌కు గురి చేస్తోంది. బట్టలు ఉతకడానికి ఉపయోగించే సర్ఫ్, యూరియా, శుద్ధి చేసిన నూనెలు, సింథటిక్ రసాయనాలను ఉపయోగించి ఓ వ్యక్తి తన ఇంట్లోనే పాలను తయారు చేస్తున్నాడు. కేవలం లాభాల కోసమే కొందరు చేసే ఈ అనైతిక చర్యలు ప్రజల ప్రాణాలను తీవ్ర ప్రమాదంలోకి నెట్టుతున్నాయి.
దర్జాగా ఇంట్లో కూర్చుని రసాయనాలతో పాలు తయారు చేసి వాటిని ప్యాకెట్లలో నింపుతూ విక్రయిస్తున్నాడన్న సమాచారం అందడంతో అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ముంబైలోని అంధేరి కపస్వాడి ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఓ నెటిజన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీంతో కల్తీ పాలు తయారు చేస్తున్న ఆ కేటుగాడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.
This image is not just disturbing — it is terrifying.
It exposes how some people are openly playing with human lives for a few filthy rupees. In Kapaswadi, Andheri West (Mumbai), a milk adulteration racket is turning daily nourishment into silent poison.
To fake milk, they are… pic.twitter.com/qP8fCksoe6
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 27, 2025
