Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Fadnavis Uddhav Thackeray Shayari Political Equations Maharashtra 2026

Maharashtra: ఎన్డీయే గూటికి ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీతో సయోధ్య కుదిరిందా..?

Published Date :March 26, 2026 , 3:43 pm
By BV Reddy
  • మహారాష్ట్రలో హాట్ హాట్ రాజకీయాలు..
  • ఎన్డీయేలోకి ఉద్ధవ్ ఠాక్రే రాబోతున్నారా..?
  • ఠాక్రేపై సీఎం ఫడ్నవీస్ ప్రశంసలపై చర్చ..
  • షిండేకు చెక్ పెట్టాలనే యోచనలో బీజేపీ..
Maharashtra: ఎన్డీయే గూటికి ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీతో సయోధ్య కుదిరిందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన సందర్భంలో, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. నిన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న వారి మధ్య పరిస్థితులు చల్లబడినట్లు కనిపిస్తోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతుందా? అనే చర్చ నడుస్తోంది. శివసేన (యూబీటీ ) చీఫ్‌గా ఉన్న ఠాక్రేపై ఫడ్నవీస్ ప్రశంసల వ్యవహారం, ఏక్‌నాథ్ షిండే శివసేనకు ప్రమాద ఘంటికలుగా పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.

ఠాక్రేపై ఫడ్నవీస్ పొగడ్తలు:

లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించారని, రాజకీయాల్లో ఆయన ప్రవర్తన హుందాగా ఉంటుందని, అదే సమయంలో 2019లో బీజేపీ-శివసేన విడిపోయిన వ్యవహారాన్ని ఒక కవిత రూపంగా చెప్పారు. ‘‘నా చేతి పట్టుకుని నడవాల్సిన వారే, కొన్ని మాటలు పట్టుకుని ఆగిపోయారు’’ అంటూ ఫడ్నవీస్ అన్నారు. దీనికి కౌంటర్‌గా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘ మరీ మీరు వేరొకరి చేయి పట్టుకోవాల్సిన అవసరం అంతగా ఏమొచ్చింది?’’ అని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఈ మాటల మార్పిడి మహా రాజకీయాల్లో సంచలనంగా మారింది.

రహస్య భేటీ:

ఇటీవల ఉద్ధవ్, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సీఎం ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శివసేన యూబీటీ ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించే విషయంపై చర్చించారు. మరోవైపు, ఇటీవల మహారాష్ట్ర మత స్వేచ్చా బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్, ఎన్సీపీ విభేదించినా, ఉద్ధవ్ వర్గం ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. ప్రతిపక్ష నాయకుడి పదవి విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీలకు చెప్పకుండా ఉద్ధవ్ ఠాక్రే స్పీకర్‌తో భేటీ అవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది.

షిండేకు చెక్:

ఇవన్నీ పరిణామాలును చూస్తే శివసేన బీజేపీకి దగ్గరవుతున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్) కూటమికి దూరమవుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇదే సమయంలో బీజేపీతో పొత్తులో ఉన్న ఏక్‌నాథ్ షిండేకు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవల సతారా స్థానిక ఎన్నికల విషయంలో షిండే, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. మరోవైపు, ఠాక్రే శివసేన తన అస్తిత్వం కోసం ప్రయత్నిస్తోంది. హిందుత్వ అంశాలపై బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aaditya Thackeray
  • BJP Shiv Sena relations
  • Devendra Fadnavis
  • eknath shinde
  • maharashtra news

తాజావార్తలు

  • Maharashtra: ఎన్డీయే గూటికి ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీతో సయోధ్య కుదిరిందా..?

  • Dawood Ibrahim: ‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక అసలు నిజాలివే!

  • CM Revanth Reddy : వైద్య రంగానికి కొత్త ఊపిరి.. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు..!

  • Prabhas: ఆల్ ఆన్ ట్రాక్.. ‘సలార్ 2’ ఒక్కటే డిసప్పాయింట్!

  • Markapur Accident: మార్కాపురం రోడ్డు ప్రమాదం… 14కు చేరిన మృతుల సంఖ్య.. మృతుల వివరాలు ఇవే..!

ట్రెండింగ్‌

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions