Maharashtra: ఎన్డీయే గూటికి ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీతో సయోధ్య కుదిరిందా..?
- మహారాష్ట్రలో హాట్ హాట్ రాజకీయాలు..
- ఎన్డీయేలోకి ఉద్ధవ్ ఠాక్రే రాబోతున్నారా..?
- ఠాక్రేపై సీఎం ఫడ్నవీస్ ప్రశంసలపై చర్చ..
- షిండేకు చెక్ పెట్టాలనే యోచనలో బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన సందర్భంలో, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. నిన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న వారి మధ్య పరిస్థితులు చల్లబడినట్లు కనిపిస్తోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతుందా? అనే చర్చ నడుస్తోంది. శివసేన (యూబీటీ ) చీఫ్‌గా ఉన్న ఠాక్రేపై ఫడ్నవీస్ ప్రశంసల వ్యవహారం, ఏక్‌నాథ్ షిండే శివసేనకు ప్రమాద ఘంటికలుగా పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.
ఠాక్రేపై ఫడ్నవీస్ పొగడ్తలు:
Also Read
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించారని, రాజకీయాల్లో ఆయన ప్రవర్తన హుందాగా ఉంటుందని, అదే సమయంలో 2019లో బీజేపీ-శివసేన విడిపోయిన వ్యవహారాన్ని ఒక కవిత రూపంగా చెప్పారు. ‘‘నా చేతి పట్టుకుని నడవాల్సిన వారే, కొన్ని మాటలు పట్టుకుని ఆగిపోయారు’’ అంటూ ఫడ్నవీస్ అన్నారు. దీనికి కౌంటర్‌గా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘ మరీ మీరు వేరొకరి చేయి పట్టుకోవాల్సిన అవసరం అంతగా ఏమొచ్చింది?’’ అని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఈ మాటల మార్పిడి మహా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
రహస్య భేటీ:
ఇటీవల ఉద్ధవ్, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సీఎం ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శివసేన యూబీటీ ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించే విషయంపై చర్చించారు. మరోవైపు, ఇటీవల మహారాష్ట్ర మత స్వేచ్చా బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్, ఎన్సీపీ విభేదించినా, ఉద్ధవ్ వర్గం ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. ప్రతిపక్ష నాయకుడి పదవి విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీలకు చెప్పకుండా ఉద్ధవ్ ఠాక్రే స్పీకర్‌తో భేటీ అవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది.
షిండేకు చెక్:
ఇవన్నీ పరిణామాలును చూస్తే శివసేన బీజేపీకి దగ్గరవుతున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్) కూటమికి దూరమవుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇదే సమయంలో బీజేపీతో పొత్తులో ఉన్న ఏక్‌నాథ్ షిండేకు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవల సతారా స్థానిక ఎన్నికల విషయంలో షిండే, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. మరోవైపు, ఠాక్రే శివసేన తన అస్తిత్వం కోసం ప్రయత్నిస్తోంది. హిందుత్వ అంశాలపై బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!