Site icon NTV Telugu

Devendra Fadnavis: బీజేపీ పరాజయానికి బాధ్యత నాదే.. డిప్యూటీ సీఎంకు పదవికి రాజీనామా..?

Fafnavis

Fafnavis

Devendra Fadnavis: తాజాగా జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాలు సాధించి మరోసారి అధికారంలోకి రాబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి వరసగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘటతను సాధించిన రెండో ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ 272ని దాటి 292 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 240 స్థానాలు సాధించింది.

Read Also: AP MLA’s: ఏపీలో మెజారిటీ వారీగా గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే.. టాప్ 3లో నారా లోకేష్!

అయితే, ఆ బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు దెబ్బతీశాయి. దీంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272ని సొంతగా చేరుకోలేకపోయింది. మహారాష్ట్రలోని 48 ఎంపీ స్థానాల్లో బీజేపీ కేవలంల 09 స్థానాలు మాత్రమే గెలిచింది. మిత్రపక్షాలైన శివసేన(షిండే) 07, అజిత్ పవార్ ఎన్సీపీ కేవలం 01 స్థానానికి మాత్రమే పరిమితమైంది. 28 సీట్లలో బీజేపీ పోటీ చేస్తే కేవలం 09 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడం ఆ పార్టీని తీవ్రంగా నష్టపరిచింది. మొత్తంగా చూస్తే ఇండియా కూటమి 29 సీట్లను గెలుచుకుని సత్తా చాటింది. కాంగ్రెస్ ఏకంగా 13 సీట్లను కైవసం చేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన 09, శరద్ పవార్ ఎన్సీపీ 07 సీట్లను సాధించింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ ఓటమికి తనదే బాధ్యత అని రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సీట్లు తగ్గిపోయాయని, ఈ ఘోర పరాజయానికి బాధ్యత తనదే అని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నానని, ఏ లోటు ఉన్న దాన్ని తీర్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తాను పారిపోయే వ్యక్తిని కాదని, కొత్త వ్యూహాలను సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ప్రభుత్వ బాధ్యతల నుంచి తనను తప్పించాలని బీజేపీ హైకమాండ్‌ని కోరుతానని, తద్వారా పార్టీ కోసం రానున్న రోజుల్లో కష్టపడుతానని చెప్పారు.

Exit mobile version