Devendra Fadnavis: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సంచలన ఫలితాలు నమోదు చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ‘‘మహాయుతి’’ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు గానూ ప్రస్తుతం 220 కిపైగా స్థానాల్లో బీజేపీ+షిండే సేన+అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే సేన, శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 54 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్నాయి.
Read Also: Ajaz Khan: ఇన్‌స్టాలో 56 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో 92 ఓట్లు..
ఈ సంచలన విజయంపై డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’(కలిసి ఉంటేనే సురక్షితం), మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే అని ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కులగణన, హిందువుల్లో విభజన భావాలను నాటాలని కాంగ్రెస్, మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) చూస్తోందని ప్రధాని మోడీ ఆరోపిస్తూ.. ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’ అనే నినాదాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం ఇదే నినాదాన్ని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే నాశనం అవుతాం) అనే నినాదం కూడా మహారాష్ట్రలో పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు నినాదాలు కూడా హిందూ ఓటర్లని సంఘటితం చేసినట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి.
एक है तो ‘सेफ’ है !
मोदी है तो मुमकिन हैं ! #Maharashtra #महाराष्ट्र— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 23, 2024