NTV Telugu Site icon

Medical Alert: పేషెంట్లకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా 24 గంటలు వైద్య సేవలు బంద్

Medicalalertindia

Medicalalertindia

దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు స్తంభించనున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఒక రోజంతా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా FAIM నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (FAIM) అధికారికంగా ప్రకటించింది. శనివారం ఓపీడీ(OPD), ఓటీ( OT) సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పేషెంట్లకు, దేశ ప్రజలకు ముందుగానే సమాచారం తెలియజేసింది. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఎమర్జెన్సీలో మాత్రం డాక్టర్లు అందుబాటులో ఉంటారని వెల్లడించింది.

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోనే వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఆమెపై సామూహిక అత్యాచారానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమెలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉంది. అలాగే ఘటనాస్థలిలో వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. అంటే బాధితురాలు.. మానవమృగాలతో తీవ్రంగా పోరాడినట్లుగా అర్ధమవుతోంది.

ఇదిలా ఉంటే ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఘోష్ దుర్మార్గుడని ఇరుగుపొరుగు వారు మీడియాకు చెబుతున్నారు. ఇక మాజీ ఉద్యోగులైతే తీవ్ర ఆరోపణలు చేశారు. ఘోష్ తన గెస్ట్‌ హౌస్‌లో సెక్స్ రాకెట్, డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురై అర్ధనగ్నంగా పడి ఉంటే.. బాధితురాలి తల్లిదండ్రులకు మాత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఇచ్చాడు. కనీసం పోలీసులకు కూడా ఫోన్ చేయలేదు. అంటే ఇదంతా ఒక ప్రక్క ప్రణాళికతో జరిగినట్లుగా సీబీఐ భావిస్తోంది. సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది.