Site icon NTV Telugu

Air India crash: 7 ఏళ్ల క్రితమే ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’ సమస్యని గుర్తించిన యూఎస్ సంస్థ..

Air India

Air India

Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను వెల్లడించింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల కారణంగానే ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది లోతైన విచారణలో తెలియాల్సి ఉంది. జూన్ 12న లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం 32 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 270 మంది మరణించారు.

Read Also: Story Board: 75 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తారా..? బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది..?

అయితే, గతంలో కూడా అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) బోయింగ్ 737 విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లకు సంబంధించిన సమస్యని హైలెట్ చేసింది. డిసెంబర్ 2018లో, US ఏవియేషన్ రెగ్యులేటర్ ఒక ప్రత్యేక ఎయిర్‌వర్తినెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ (SAIB)ను విడుదల చేసింది. కొన్ని బోయింగ్ 737 విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు లాకింగ్ ఫీచర్‌ లేకుండా ఇన్‌స్టాల్ చేశారని పేర్కొంది.

Read Also: Rajinikanth : కమలహాసన్ అంత మేధావిని కాదు నేను.. రజనీకాంత్ కామెంట్స్ వైరల్ !

ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు విమానం ఇంజన్లు ఆన్, ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తారు. గాలిలో ఉండగా ఇంజన్ ఫెయిల్యూర్ అయితే, షట్ డౌన్ చేసి మళ్లీ ప్రారంభించడానికి ఉపయోగిస్తారు. తాజాగా, ఎయిర్ ఇండియా ఘటనలో మూడు సెకన్లలోపే రెండు ఇంజన్లు ఒకదాని తర్వాత ఒకటి మూడు సెకన్లలోపే ‘‘రన్’’ నుంచి ‘‘కట్ఆఫ్’’ స్థానానికి మారాయి. ఈ విషయంపై కాక్‌పిట్‌లో గందరగోళం ఏర్పడింది. పైలట్లలో ఒకరు మరొకరిని ఇంధనాన్ని ఎందుకు కట్ చేశాడని అడుగుతున్నట్లు ‘‘కాక్‌పిట్ వాయిస్ రికార్డర్’’లో రికార్డైంది.

Exit mobile version