NTV Telugu Site icon

Kolkata doctor murder case: “కంటికి గాయాలు, మెడ ఎముక ఫ్రాక్చర్”.. వైద్యురాలి హత్యాచార ఘటనలో వణికించే నిజాలు..

Kolkata Rape Murder

Kolkata Rape Murder

Kolkata doctor murder case: కోల్‌కతా ట్రైనీ పీజీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన వెస్ట్ బంగాల్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ మెడికల్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్‌పై దారుణం జరిగింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. 31 ఏళ్ల వైద్యురాలి ఘటన ఆ రాష్ట్రంలో పొలిటికల్ దుమారం రేపింది.

ఇదిలా ఉంటే ఆమె పోస్టుమార్టం నివేదికలో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఆమెను దారుణంగా హింసించి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఒంటిపై అనేక గాయాలు ఉన్నాయి. ఆమె రెండు కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగింది. ముఖంపై గోరుతో రక్కిన గాయాలు ఉన్నాయి. వైద్యురాలి బొడ్డు, పెదవులు, ఎడమకాలు, మెడ, కుడి చేతిలోని ఉంగరపు వేలుపై గాయాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా లైంగిక వేధింపుల కేసే అని పోలీస్ అధికారి వెల్లడించారు. ఆమె మెడ ఎముక విరిగినట్లు గుర్తించారు. ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Divvala Madhuri: దువ్వాడ శ్రీనివాస్, నేను కలిసే ఉంటాం.. డైవర్స్కి కూడా అప్లై చేశాం

ఈ కేసులో ప్రతిపక్ష బీజేపీ, అధికార టీఎంసీ ప్రభుత్వాన్ని ,సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేసింది. ఈ ఘటనలో నేరస్తుడిని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కేంద్ర ఎజెన్సీలతో దర్యాప్తుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బాధితురాలు ఛెస్ట్ మెడిసిన్‌లో పీజీ చేస్తోంది. సంఘటన జరిగిన సమయంలో నైట్ డ్యూటీలో ఉంది. ఆమె మృతదేహం శుక్రవారం ఆస్పత్రి సెమినార్ హాల్‌లో లభించింది.

నిందితుడిని గుర్తించేందుకు సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసులు అనుమానితుల జాబితాను సిద్ధం చేశారు. సంఘటన స్థలంలో ‘‘బ్లూటూత్’’ హెడ్‌ఫోన్ దొరికింది. అనుమానితులను విచారణ కోసం పిలిచిన సందర్భంలో నిందితుడి మొబైల్ ఫోన్‌తో బ్లూటూత్ ఆటొమెటిక్‌గా కనెక్ట్ అయింది. నిందితుడికి మరణశిక్ష విధించేలా పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు ఇచ్చారు. టీఎంపీ ఎంపీ, మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. కేంద్రం ఇలాంటి కేసుల్లో దోషులను కఠినంగా శిక్షించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని, దానికి టీఎంసీ మద్దతు ఉంటుందని చెప్పారు. నిందితుడికి ఉరిశిక్ష లేదా ఎన్‌కౌంటర్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show comments