తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. జూలై 16 నుంచి ఈనెల 20 వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అలర్ట్‌గా ఉండాలని ప్రభుత్వాలకు, ప్రజలకు సూచించింది. ఏఏ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ జాబితా విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Sati: భర్త మరణంతో భార్య ‘సతీ సహగమనం’.. ఎక్కడంటే..
జూలై 16-20 మధ్య గోవా, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే పంజాబ్, హర్యానా, ఢిల్లీలో కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన సీఎం చంద్రబాబు
ఇదిలా ఉంటే ఇప్పటికే పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇళ్లు మునిగిపోయి ప్రజలు సర్వం కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వారిని శిబిరాలకు తరలించి ఆహారాన్ని అందిస్తున్నారు. మరోవైపు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Karnataka: తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి