Breaking News: బీజేపీ కార్యాలయం వెలుపల పేలుడు..

  • బీజేపీ ఆఫీస్ బయట పేలుడు..
  • ఛండీగఢ్‌లో స్కూటర్ బ్లాస్ట్..
Bjp Incident

Bjp Incident

Breaking News: పంజాబ్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయం వెలుపల పేలుడు సంభవించింది. ఛండీగడ్ బీజేపీ కార్యాలయం బయట స్కూటర్‌ పేలినట్లు తెలిసింది. ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

Read Also: Digital Payments: ఏప్రిల్ 1 నుంచి పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త.. నేటి నుంచి OTP ఒక్కటే ఎందుకు పని చేయదు?

చండీగఢ్‌లోని సెక్టార్ 37లో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ పేలుడు పెద్ద తీవ్రత కాదని సమాచారం. పంజాబ్ బీజేపీ కార్యాలయం బయట సీఆర్పీఎఫ్‌ను మోహరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంఘటనా స్థలం నుంచి పేలుడు తర్వాత ఎగిసిపడిన శకలాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.