NTV Telugu Site icon

Kejriwal: లిక్కర్ కేసులో ఎదురుదెబ్బ.. ట్రయిల్‌ కోర్టు విచారణపై స్టేకు హైకోర్టు నిరాకరణ

Kejriwal

Kejriwal

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం పాలసీ కేసులో ట్రయిల్‌ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కొట్టి వేసింది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై స్పందించాలని ఈడీని కోరింది.

ఇది కూడా చదవండి: Weather Report: నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం!

లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తాజాగా మరిన్ని ఆధారాల్ని సేకరించింది. సేకరించిన ఆధారాలతో అనుగుణంగా కేజ్రీవాల్‌ను విచారణ చేపట్టాలని కోరుతూ ట్రయల్‌ కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ట్రయల్‌ కోర్టు పరిశీలించింది. కేజ్రీవాల్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ట్రయల్‌ కోర్టు నిర్ణయం తర్వాత ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లలో ట్రయల్‌ కోర్టులో విచారణ కావాలని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Prasar Bharati: ఓటీటీ ప్రియులకు ప్రసార భారతి శుభవార్త.. ఇకపై ఇవన్నీ ఫ్రీ!

ట్రయల్‌ కోర్టు విచారణపై స్టే విధించలేమని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 20కి వాయిదా వేసింది. లిక్కర్ పాలసీ కేసులో దాదాపు 6 నెలలు కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన స్థానాన్ని అతిషికి అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లనున్నారు.

ఇది కూడా చదవండి: Terrorist Attack: ఉగ్రదాడిలో 50 మంది హతం..