సాధారణంగా పాత మద్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది.. ఏళ్లు గడిచిన విస్కీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది.. అయితే, ఓ మంత్రి గారు ఇస్తున్న పార్టీకి 15 ఏళ్ల పాత గ్లెన్‌ఫిడ్డిచ్ స్కాచ్ విస్కీ ఫుల్ బాటిళ్లు కావాలంటూ.. వైన్ షాపుకు ఫోన్ చేసిన ఎక్సైజ్ శాఖ ఎన్‌స్పెక్టర్ డిమాండ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఈ నెల 14వ తేదీన గురుగ్రామ్ లోని సెక్టార్ 47 వద్ద ఉన్న మద్యం షాపుకు ఫోన్ చేసిన ఇన్‌స్పెక్టర్ సందీప్ లోహాన్.. మంత్రి ఆధ్వర్యంలో జరిగే పార్టీకి 15 ఏళ్ల పాత గ్లెన్‌ఫిడ్డిచ్ స్కాచ్ విస్కీ ఫుల్ బాటిళ్లు ఆరు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.. అయితే, సదరు ఉద్యోగి ఆ బాటిళ్లు లేవని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు.. అంతే కాదు.. రెండు రోజుల తర్వాత మద్యం షాపు దగ్గరకే వచ్చిన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్.. కస్టమర్ల ముందే బూతులు తిట్టి బలవంతంగా వైన్స్‌ను మూయించడం రచ్చగా మారింది.
Read Also: Telangana Politics : తెలంగాణ బీజేపీ నేతలకు పెరుగుతున్న ప్రాధాన్యం
అయితే, ఈ ఘటనతో షాక్ తిన్న మద్యం షాపు యజమాని… ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అనూజ్.. సీఎం, హోంశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఈ ఘటనపై స్పందించిన ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషనర్ రవీందర్ సింగ్… మంత్రి పేరిట స్కాచ్ విస్కీ బాటిళ్లు డిమాండ్ చేసిన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ పై బదిలీ వేటు వేశామని తెలిపారు.. పంచకులలోని హెడ్ క్వార్టరుకు సందీప్ ను బదిలీ చేశామని.. సందీప్ లోహాన్ పై దర్యాప్తు చేసి.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.. విషయం మా దృష్టికి వచ్చిన తర్వాత, ఇన్‌స్పెక్టర్‌ను గురుగ్రామ్ లో డ్యూటీ నుంచి తొలగించాం.. ఈ కేసును అసిస్టెంట్ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ ఆఫీసర్ విజయ్ కుమార్ దర్యాప్తు చేస్తారు మరియు విచారణ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
