Site icon NTV Telugu

Bihar: తేజస్వి యాదవ్ భార్యపై ఓ మాజీ నేత అనుచిత వ్యాఖ్యలు.. బీహార్‌లో ఆర్జేడీ నేతల ఆందోళన

Bihar

Bihar

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాక ముందే నేతలంతా మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు-ప్రతి విమర్శలు సహజమే. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి రాద్ధాంతం చేస్తున్నారు. ఇటీవల ఓ కాంగ్రెస్ కార్యకర్త.. ప్రధాని మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. తాజాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భార్యపై ఆ పార్టీ మాజీ నేత రాజ్‌బల్లభ్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్జేడీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి దిష్టిబొమ్మలను తగలబెట్టారు.

ఇది కూడా చదవండి: JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!

నవాడా జిల్లాలో ఒక బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ఆర్జేడీ మాజీ నేత రాజ్‌బల్లభ్ యాదవ్.. తేజస్వి యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని పరుష పదజాలం ప్రయోగించారు. తేజస్వి యాదవ్.. ‘‘బీహార్ అమ్మాయిని కాకుండా.. వేరే రాష్ట్రం అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఓట్ల కోసమే కులాన్ని ఉపయోగిస్తారా? పెళ్లి విషయంలో మాత్రం కులాన్ని పరిగణనలోకి తీసుకోరా?, తేజస్వి యాదవ్ వివాహం ఎక్కడ జరిగింది? హర్యానా? లేదా పంజాబ్‌లో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? స్త్రీని తెచ్చుకున్నాడా? లేదంటే జెర్సీ ఆవును తెచ్చుకున్నాడా? యాదవ్ సమాజంలో అసలు అమ్మాయిలే లేరా?’’ అంటూ తేజస్వి యాదవ్ భార్య పేరు ప్రస్తావించకుండా తీవ్ర విమర్శలు చేశాడు.

ఇది కూడా చదవండి: Rekha Gupta-AAP: ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త హాజరు.. ఆప్ తీవ్ర విమర్శలు

తాజాగా రాజ్‌బల్లభ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆర్జేడీ పార్టీ మహిళా విభాగం నిరసనలు నిర్వహించింది. దిష్టిబొమ్మలను తగలబెట్టారు. రాజ్‌వల్లభ్‌ వ్యాఖ్యలు అసభ్యకరమైనవి.. ఆమోదయోగ్యం కాదని ఖండించారు. నవాడా మాజీ ఎమ్మెల్యే, ఆర్జేడీ సీనియర్ నాయకుడు కౌశల్ యాదవ్ మీడియాతోమాట్లాడుతూ.. లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు రాజ్‌శ్రీ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలు దళిత వర్గాలపై దాడిగా అభివర్ణించారు. లాలూ ప్రసాద్ యాదవ్ దేశంలోని అగ్ర నాయకులలో ఒకరని.. వెనుకబడిన, దళితుల నాయకుడు అని చెప్పారు. రాజ్‌శ్రీ యాదవ్‌‌పై చేసిన వ్యాఖ్యలు సమాజాన్ని బాధపెట్టాయన్నారు. సమాజం గుండె పగిలిపోయిందని పేర్కొన్నారు. పదేళ్ల క్రితం అత్యాచారం కేసులో జైలుకెళ్లిన వ్యక్తి.. స్త్రీల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? అని మండిపడ్డారు.

తేజస్వి యాదవ్ 2021లో తన బ్యాచ్‌మేట్ రాచెల్ కోడిన్హోను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత రాజశ్రీ యాదవ్‌గా పేరు మార్చుకున్నారు. రాజశ్రీ యాదవ్‌‌ది హర్యానాలోని రేవారీ ప్రాంత వాసి. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఇక బహిరంగంగా కనిపించిన దృశ్యాలు చాలా అరుదు. కుమార్తె కాత్యాయిని మార్చి 2023లో జన్మించారు. ఇక మే నెలలో కుమారుడు జన్మించాడు.

రాజ్‌బల్లభ్ యాదవ్.. ఆర్జేడీ మాజీ నేత. పోక్సో కేసులో తొమ్మిదిన్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. నవాడా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో తేజస్వి యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగాడు.

Exit mobile version