NTV Telugu Site icon

Puja Khedkar: సుప్రీంకోర్టు తలుపుతట్టిన పూజా ఖేద్కర్.. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై సవాల్

Pujakhedker

Pujakhedker

మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజ ఖేద్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యూపీఎస్సీ మోసం కేసులో ఇటీవల బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తాజాగా దీన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

2022లో యూపీఎస్సీ పరీక్షలో మోసపూరితంగా ఉత్తీర్ణత సాధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె సర్వీసును యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్‌లో ఎలాంటి పరీక్షల్లో హాజరకాకుండా నిషేధం విధించింది. దీంతో ఢిల్లీ పోలీసులు.. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించింది. అయితే ఈ కేసు రాజ్యాంగ సంస్థకు వ్యతిరేకమే కాకుండా సమాజం, దేశానికి వ్యతిరేకంగా చేసిన క్లాసిక్ మోసం అంటూ హైకోర్టు పేర్కొంటూ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

ఇది కూడా చదవండి: Amazon Great Republic Day Sale 2025: న్యూ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. ఐకూ ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్!

తాజాగా సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. జనవరి 15, 2025న సుప్రీంకోర్టులో విచారణకు లిస్ట్ చేయబడుతుందని భావిస్తున్నారు. రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడం కోసం యూపీఎస్సీ దరఖాస్తులో సమాచారాన్ని తప్పుగా చూపించినందుకు ఖేద్కర్ దోషి అని విచారణలో తేలడంతో సెప్టెంబర్ 2024లో ఐఏఎస్ నుంచి పూజా ఖేద్కర్ డిశ్చార్జ్ అయ్యారు.

ఇది కూడా చదవండి: Sabarimala: శబరిమలలో మకరజ్యోతి దర్శనం… అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన శబరిగిరులు

Show comments