కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజువారి పాజిటివ్ కేసులు 20 వేలకు పైగా నమోదవుతుండటంతో కేరళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నప్పటికీ, కేసులు కంట్రోల్ కావడంలేదు. పైగా రోజువారీ కేసులు భారీ స్తాయిలో పెరుగుతుండటంతో ప్రభుత్వం కట్టడికి కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నది. ఇకపై ప్రతి ఆదివారం రోజున రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో రోజువారీ కేసుల్లో సగం కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మూడోవేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో కేరళ నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో సరిహద్దు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆర్‌టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి అడుగుపెట్టనిస్తామని తమిళనాడు, కర్ణాటక సర్కార్లు నిర్ణయాలు తీసుకున్నాయి.
ఆ రాష్ట్రంలో ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్…
