Site icon NTV Telugu

MK Stalin: “మోడీ కళ్లు కూడా ఆయన కన్నీళ్లను నమ్మవు”.. ప్రధానిపై స్టాలిన్ కామెంట్స్..

Stalin Modi

Stalin Modi

MK Stalin: డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. తమిళ భాషను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘‘మోడీ ళ్లు కూడా అతని కన్నీళ్లను నమ్మవు’’ అని విమర్శించారు. గతంలో తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఇంగ్లీష్‌లో మాట్లాడే ప్రధాని ఇప్పుడు ఎందుకు హిందీలో మాట్లాడారని ప్రశ్నించారు.

‘‘నిన్న సాయంత్రం, తనకు తమిళం ఎలా మాట్లాడాలో తెలియనందుకు పశ్చాత్తాపపడుతున్నానని మోడీ అన్నారు. ఇక్కడి అందమైన తమిళ పదం ‘వనోలి’ని హిందీ పదం ‘ఆకాశవాణి’గా మార్చుతున్నట్లు నిన్నటి వార్తలు చెబుతున్నాయి. ఆయన కన్నీటిని కూడా మోడీ కళ్లు కూడా నమ్మవు, తమిళ ప్రజలు ఎలా నమ్ముతారు..? మీరు మీ ఒక కంటిని పొడుచుకుంటూ, మరో కంటితో కన్నీరు కారుస్తున్నారు, ఇది ఎలాంటి తమిళ ప్రేమ..?’’ అని స్టాలిన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Read Also: Tillu Square: టిల్లు స్క్వేర్ డైరెక్టర్‌తో సందీప్ కిషన్.. కానీ అక్కడే ట్విస్టు!

ప్రతీ చోట హిందీ, దేనిలోనైనా హిందీ అనేదాన్ని మోడీ సర్కార్ అవలంభించడం దురదృష్టకమరని ఆయన ఆరోపించారు. 2019లో తమిళనాడు నుంచి వచ్చే విమానాల్లో ప్రకటనల కోసం తమిళాన్ని వాడుతామని చేసిన హామీపై స్టాలిన్ ప్రధాని మోడీని ప్రశ్నించారు. ‘‘విమానాలు మరిచిపోండీ, రాష్ట్రంలో విమానాశ్రయాల్లోని భద్రతా సిబ్బందికి తమిళం, ఇంగ్లీష్ తెలియడం లేనది తన ట్వీట్‌లో ఆరోపించారు. కులం, మతం, భాష ఆధారంగా ప్రజలను విభజించాలని బీజేపీ చూస్తోందని సీఎం మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం రావాలంటే ఇండియా కూటమికి ఓటేయాలని పిలుపునిచ్చారు.

Exit mobile version