Supreme Court: ఈ రోజు (గురువారం) వేర్పాటు వాది యాసిన్ మాలిక్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబైలో ఉగ్ర దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని తెలిపింది. యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుటు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, జమ్మూకశ్మీర్ న్యాయస్థానం ఆదేశాలను సీబీఐ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ ఎంక్వైరీ సందర్భంగా.. సుప్రీం పైన పేర్కొన్నా వ్యాఖ్యలు చేసింది.
Read Also: Rachamallu SivaPrasad Reddy: మందుబాబుల వల్లే ఓటమిపాలయ్యా..! మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఇక, 1990లో శ్రీనగర్ శివారులో నలుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది హత్య కేసుతో పాటు 1989లో రుబయా సయీద్ (దివంగత హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్) కిడ్నాప్ కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా కొనసాగుతున్నాడు. అలాగే, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదుగా ఉన్నాడు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో అతడు జమ్మూ కశ్మీర్ వెళ్లడం మంచిది కాదని సీబీఐ తరఫున లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.