Delhi Floods: ఢిల్లీతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు యయునా నది మహోగ్ర రూపం దాల్చింది. 1978 తర్వాత రికార్డు స్థాయిలో 207.49 మీటర్ల గరిష్ట నీటిమట్టానికి యమునా నది చేరింది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఢిల్లీ వాసులు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేయాలని ప్రజలను సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు కట్టుబట్టలతో లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
Read Also: Thalapathy Vijay : స్టార్ డైరెక్టర్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్న విజయ్ దళపతి..?
మేము ప్రాణాలను, ఆస్తులను రక్షించాలి, యమునా నదికి సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 2013 తర్వాత తొలిసారిగా బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు పాత రైల్వే బ్రిడ్జి వద్ద నీటిమట్టం 207 మీటర్ల మార్కును దాటిందని, సాయంత్రం 4 గంటల సమయానికి 207.71 మీటర్లకు చేరుకుందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) వరద పర్యవేక్షణ పోర్టల్ తెలిపింది.
యుమునా నదికి పెరుగుతున్న వరదను నివారించడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. గత రెండుమూడు రోజులుగా ఢిల్లీలో వర్షాలు కురవలేదని హిమచల్ ప్రదేశ్, హర్యానా నుంచి ఢిల్లీకి వరద నీరు చేరుతుందని ఆయన కేజ్రీవాల్ అన్నారు. ఈ విషయమై ఇప్పటికే హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు తెలిపారు. సాధ్యమైతే హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని నియంత్రిత పద్ధతిలో విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ఆయన ప్రతిపాదించారు. దేశ రాజధానిలో వరద వార్తలు ప్రపంచానికి మంచి సందేశాన్ని ఇవ్వవని, ఢిల్లీ ప్రజలను ఈ పరిస్థితి నుంచి రక్షించాలని కోరారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ జీ-20 సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సూచించారు.