Site icon NTV Telugu

Trump tariffs: భారత్, చైనాలపై 100 శాతం సుంకాలు విధించం.. ట్రంప్ మాట వినని ఈయూ..

Trump5

Trump5

Trump tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్‌తో ప్రపంచదేశాలు విసిగిపోయాయి. ప్రపంచంలోనే పలు ప్రధాన దేశాలపై ఆయన సుంకాలు విధించారు. అన్ని దేశాల కన్నా ఎక్కువగా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. దీనికి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తున్నారనే సాకు చెబుతున్నారు. ఇదే కాకుండా, భారత్‌పై మరింత ఒత్తిడి పెంచేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ), ఇతర యూరప్ దేశాలను తమలాగే భారత్‌పై సుంకాలు విధించాలని కోరుతున్నారు.

Read Also: Indian Rupee: డాలర్‌తో పోలిస్తే రికార్డ్ స్థాయిలో రూపాయి పతనం.. భారత్ ఏం పాపం చేసింది..

ఇదిలా ఉంటే, ట్రంప్ మాటల్ని ఇతర దేశాలు పట్టించుకోవడం లేదు. రష్యా నుంచి చమురు కొంటున్న భారత్, చైనాలపై ఈయూ సుంకాలు విధించే అవకాశం చాలా తక్కువగా ఈయూ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్, చైనాలు ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని, రష్యాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ రెండు దేశాలపై ఈయూ 100 శాతం సుంకాలు విధించాలని ట్రంప్ ఈయూను కోరారు. దీనికి ఈయూ అధికారులు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.

Exit mobile version