కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ బేసిక్ శాలరీ లిమిట్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బేసిక్ శాలరీ లిమిట్ 15 వేలు ఉండగా.. ప్రస్తుతం 25వేలకు పెంచే అవకాశముంది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరగనున్నట్లు సమాచారం. కార్మిక సంఘాలు కూడా బేసిక్ శాలరీ లిమిట్ ను పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాయి. దీంతో కోటి మందికి పైగా ఉద్యోగులు.. EPF, EPS కవరేజీలోకి వస్తారు.
Read Also: Winter Bath: చలికాలంలో వేడి నీళ్లు మంచివా.. చలి నీళ్లు మంచివా..
ఈపీఎఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈపీఎఫ్ లిమిట్ 15 వేలు ఉండగా.. దాన్ని 25వేలకు పెంచేందుకు సిద్ధంగా ఉంది. ఈ పరిమితిని పెంచితే.. కోటి మందికి పైగా ఉద్యోగులు.. EPF, EPS కవరేజీలోకి వస్తారని అధికారులు చెబుతున్నారు. ఈపీఎఫ్ లో ఉద్యోగి జీతం నుంచి 12శాతం.. ఈపీఎఫ్ కు వెళ్తుంది. ఎంప్లాయర్ దీనికి మరో 12 శాతం కలుపుతారు. అయితే.. ఇందులో 8.33 శాతం.. ఈఫీఎస్ కు వెళుతుంది. 3.67 శాతం ఈ పీఎఫ్ కు వెళుతుంది. ఒక వేళ బేసిక్ శాలరీ లిమిట్ పెరిగితే.. ఇవన్నీ పెరిగే అవకాశం లేకపోలేదు. దీంతో జీవితాంతం పెన్షన్, ఈపీఎఫ్‌పై ఎక్కువ వడ్డీ, ఎంప్లాయర్ చెల్లింపు వంటివి పెరుగుతాయని.. ఎక్కువ శాతం ఎంప్లాయిస్ పెన్షన్ పరిధిలోకి వస్తారని.. అధికారులు చెబుతున్నారు.
Read Also:Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
దీన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే.. 15 వేల కంటే ఎక్కువ బేసిక్ శాలరీ తీసుకునే వారు కూడా ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వస్తారు. కానీ వీరు స్కీమ్ లో చేరాలనే.. రూల్ మాత్రం లేదు.. దీంతో వారు ఎప్పుడైనా వీటి నుంచి తప్పుకోవచ్చు. నగరాల్లో తక్కువ జీతాలతో బతికే.. చిన్న స్థాయి ఉద్యోగులే ఎక్కువగా ఉంటాయి. అయితే .. ఈపీఎఫ్ బేసిక్ శాలరీ లిమిట్ పెంచాలని కార్మిక సంఘాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి.
