NTV Telugu Site icon

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల హతం..

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter

Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి తుపాకీ శబ్ధాలతో దద్దరిల్లాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ సందర్భంగా శుక్రవారం మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణపూర్-దంతేవాడ సరిహద్దు ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఎన్‌కైంటర్ ప్రారంభమైంది. ఇరు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు దంతెవాడ ఎస్పీ తెలిపారు.

Read Also: Tirumala Laddu Controversy: సుప్రీంకోర్టు తీర్పుపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు..

నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో భద్రతా బలగాలు సురక్షితంగా ఉన్నాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల పోలీస్ బృందాలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. బస్తర్ వ్యాప్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. ఎన్‌కౌంటర్ తర్వాత భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.