దేశంలో నక్సలిజాన్ని రూపుమాపేందుకు.. మావోయిస్టులను ఏరివేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ లో భద్రతా బలగాలు పలువురు మావోలను మట్టుబెట్టారు. తాజాగా మరో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిపారు.
Also Read:CM Chandrababu: రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉంది..
శనివారం జరిగిన ఈ సంఘటనను పోలీసులు నిర్ధారించారు. సుక్మా అడవుల్లో భద్రతా దళాలు మావోలను ఏరివేసేందుకు జల్లెడపడుతుండగా నక్సలైట్లు భద్రతాబలగాలపై దాడి చేశారు. వెంటనే అలర్ట్ అయిన సైనికులు మావోలకు ధీటుగా కాల్పులు జరిపారు. ఇరువైపుల నుంచి భారీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. కాగా సంఘటన స్థలం చుట్టూ ఉన్న ప్రాంతంలో నక్సలైట్ ల కోసం సోదాలు కొనసాగుతున్నాయి.
Also Read:Champions Trophy 2025: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్..
సుక్మా జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ఒకటి కావడం గమనార్హం. ఇక్కడ గతంలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో నక్సలైట్ కార్యకలాపాలను నియంత్రించడానికి పోలీసులు, భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. కాగా తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన నక్సలైట్లను గుర్తించే పనిలో ఉన్నామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.