ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది.. మరో రెండు మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్లను ప్రకటించే అవకాశం ఉంది.. ప్రమోషన్‌కు సంబంధించిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. మొత్తంగా, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 1వ తేదీన 8 వేల మందికి పైగా కేంద్ర అధికారులకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి పలువురు అధికారులకు పదోన్నతి కల్పించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర సిబ్బంది మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.. అధికారుల ప్రతినిధి బృందంతో సమావేశమైన ఆయన.. రెండు మూడు వారాల్లో పదోన్నతుల ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ప్రమోషన్లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తిగా ఉన్నారని ప్రతినిధి బృందానికి మంత్రి తెలిపారు.
Read Also: Alia Bhatt: లూజ్ వైట్ షర్ట్ లో అలియా.. బేబీ బంప్ ను దాచేస్తుందే
కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు మరియు వివిధ విభాగాలలో పరిపాలనాపరమైన పనులు చేస్తున్న అధికారులు చివరిగా 2019లో పదోన్నతి పొందారు. ఆ సమయంలో 4 వేల అధికారులు మూడు సర్వీసుల్లో పదోన్నతి పొందారు. అయితే, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వోద్యోగులు పదోన్నతి లేకుండా సర్వీసు నుంచి రిటైర్ కావడం నిరాశ కలిగిస్తుందన్నారు.. 8,089 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడంలో న్యాయపరమైన అడ్డంకులు అన్నీ పరిష్కారమయ్యాయని.. ఇక నుంచి అన్ని భవిష్యత్ పదోన్నతులను క్రమబద్ధీకరిస్తామన్నారు. అయితే, సెంట్రల్ సెక్రటేరియట్ అధికార భాషా సేవా గ్రూప్-ఎ అధికారుల ప్రతినిధి బృందం.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను కలిసింది.. పదోన్నతి కల్పించాలనే డిమాండ్ వినిపించింది.. ఈ సమావేశంలో, వారి పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.. అధికారులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నాం… మరో రెండు మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్‌ను ప్రకటించనుందన్నారు.
