NTV Telugu Site icon

Elon Musk: భారత్, చైనా సహా పలు దేశాల్లో జనాభా క్షీణతపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన

Elon Musk

Elon Musk

Elon Musk: భారత్, చైనా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా క్రమంగా క్షీణించడంపై అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటని చెప్పుకొచ్చాడు. అయితే, జనాభా క్షీణత అంచనాకు సంబంధించిన ఓ గ్రాఫ్‌ను టెస్లా ఓనర్స్‌ సిలికాన్ వ్యాలీ ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్‌ చేసింది. నైజీరియా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్థాన్‌, భారత్, చైనా సహా మరి కొన్ని కీలక దేశాల్లో 2018-2100 నడుమ జనాభాలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయనే దాన్ని అందులో చూపించారు.

Read Also: Vizag Steel Plant: విశాఖ పర్యటనకు మోడీ.. స్టీల్‌ప్లాంట్‌పై కీలక ప్రకటన..!

అయితే, ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన దేశాలుగా గుర్తింపు పొందిన చైనా, భారత్‌లో 2100 నాటికి జనభా అధికంగా క్షీణిస్తూ ఉంటుందని టెస్లా ఓనర్స్‌ సిలికాన్ వ్యాలీ వేసిన గ్రాఫ్ లో ఉంది. ఈ గ్రాఫ్‌ను పోస్ట్‌ చేస్తూ.. జనాభా తగ్గుదల మానవాళికి అత్యంత ప్రమాదంగా పేర్కొన్నాడు ఎలాన్‌ మస్క్‌’ అని టెస్లా ఓనర్స్‌ సిలికాన్‌ వ్యాలీ తాను షేర్ చేసిన పోస్ట్‌లో వెల్లడించింది. దీనికి మస్క్‌ రియాక్ట్ అవుతూ.. ‘అవును’ అని రాసి ఆ గ్రాఫ్‌ను రీపోస్ట్ చేసేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Show comments