Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!

  • స్టార్‌లింక్ ఇండియా ఎంట్రీపై ఎలాన్ మస్క్ తీవ్ర అసంతృప్తి
  • నేరుగా ముకేశ్ అంబానీ పేరును ప్రస్తావించిన మస్క్
  • “భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?” అంటూ ప్రశ్న
Elon Musk Starlink Phone

Elon Musk Starlink Phone

Elon Musk: ప్రపంచ కుబేరుడు భారత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయేనా?’’ అని ప్రశ్నించారు. ఎక్స్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా డాక్టర్ అనిరుద్ధ ‘‘భారత పౌరులను పట్టించుకోకుండా, ప్రభుత్వం పెట్టుబడిదారీ విధానాన్ని కాపాడుతోందా?’’ అని ప్రశ్నించారు. ఈ పోస్టుపై స్పందించిన ఎలాన్ మస్క్.. ‘‘స్టార్‌లింక్‌కు 165 దేశాలలో లైసెన్సులు ఉన్నాయి, మరియు ఐదేళ్లుగా అన్ని నిబంధనలనూ పాటిస్తున్నప్పటికీ, భారతదేశంలో దీనికి లైసెన్సు ఎందుకు లభించడం లేదు? భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయేనా?’’ అని ట్వీట్ చేశారు.

భారత్‌లో తన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని ప్రారంభించడంలో ప్రభుత్వం అనుమతులు జాప్యం చేయడంపై ఆయన స్రశ్నించారు. కొంత మంది ‘‘ఒలిగార్క్‌లు’’ స్టార్ లింక్‌ను అడ్డుకున్నారని మస్క్ ఆరోపించారు. ఇప్పుడు కేవలం కొన్ని గంటల తర్వాత ‘‘భారత్‌కు అసలైన బాస్ అంబానీనా?’’ అని ప్రశ్నించడం సంచలనంగా మారింది.

అయితే, మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ నియమాలు అన్ని కంపెనీలకు సమానంగా వర్తిస్తాయని, స్టార్ లింక్‌పై ఎలాంటి వివక్ష లేదని ప్రభుత్వం పేర్కొంది. అంతకుముందు కొంతమంది శక్తివంతమైన వ్యాపారవేత్తలు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి భారత్‌లో స్టార్ లింక్ సేవల్ని అడ్డుకున్నారని ఆరోపించారు. తాజా పోస్టులో నేరుగా అంబానీ పేరు ప్రస్తావించారు.

మస్క్ ఆరోపణలకు భారతీయులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. BYD కార్లకు భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, యూకే, ఐరోపా మరియు 121 దేశాలలో అనుమతి ఉంది. టెస్లా కార్ల కారణంగా అమెరికా BYDకి అనుమతి లేదని అన్నారు. అమెరికాకు బాస్ ఎలాన్ మస్క్‌ ఏనా? అని అడుగుతున్నారు. అలాగే, స్టార్‌లింక్ (Starlink) మాదిరిగానే ఎయిర్‌టెల్, జియోలకు కూడా శాటిలైట్ ఇంటర్నెట్ లైసెన్స్ లభించలేదని నెటిజన్లు ఎత్తిచూపిస్తున్నారు.