Elephants Fight Kerala: సాధారణంగా ఏనుగులు మనుషులతో ఫ్రెండ్లీగానే ఉంటాయి. అయితే అప్పుడప్పుడు మాత్రం చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటాయి. ముఖ్యంగా జనావాసాల మధ్య పెరిగే ఏనుగులు మావటి కంట్రోల్ లో ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం క్రూరంగా వ్యవహరిస్తుంటాయి. కంట్రోల్ చేసే మావటిని కూడా చంపిన సందర్భాలు ఉన్నాయి. అడ్డొచ్చిన ప్రతీదాన్ని ధ్వంసం చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు కేరళ, అస్సాం రాష్ట్రల్లో ఎక్కువగా నమోదు అవుతుంటాయి.
Read Also: NIA: కేరళలో ఎన్ఐఏ రైడ్స్.. పీఎఫ్ఐ లక్ష్యంగా 56 చోట్ల దాడులు..
తాజాగా కేరళలోని పాలక్కాడ్ జిల్లా తూర్పు అంజేరి ప్రాంతంలో ఏనుగులు కొట్టుకున్నాయి. కిజక్కంచెరి తిరువార శివాలయంలో నిరమల జరిగే ఉత్సవాల కోసం మూడు ఏనుగులను నిర్వాహకులు తీసుకువచ్చారు. వాటిని అందంగా అలంకరించి ఆలయం వద్దకు స్థానికులు తీసుకువచ్చారు. ఆలయం సమీపంలోకి రాగానే ఏనుగులు గొడవకు దిగాయి. మూడు ఏనుగుల్లో ఒకటైన పుత్తూరు దేవీనందన్ అనే ఏనుగు ఉరుకులు పరుగులు పెట్టి మిగతా రెండింటిపై దాడి చేయడం ప్రారంభించింది. ఏనుగుల ఘర్షణలో ఆరు బైకులు, పలు కార్లు ధ్వంసం అయ్యాయి. ఆలయ సమీపంలోని షాపులను ధ్వంసం చేశాయి. చాలా సేపు తర్వాత వాటిని మావటీలు కంట్రోల్ చేశారు. ఏనుగులను తలోదిక్కు తీసుకెళ్లడంతో వీటి మధ్య ఘర్షణ తగ్గింది. ఈ ఘటనలో గిరీష్ కట్టుస్సేరి (35) అనే వ్యక్తి గాయపడ్డాడు. ఏనుగులను అదుపు తెచ్చేందుకు మావటీలకు దాదాపుగా 2 గంటల సమయం పట్టింది.