NTV Telugu Site icon

Tamilnadu: తమిళనాడులో ఘోరం.. కరెంట్ ఫెన్సింగ్ కారణంగా ఏనుగులు మృతి

Elephents

Elephents

Elephants die due to current fencing: తమిళనాడులో ఘోరం జరిగింది. కరెంట్ ఫెన్సింగ్ తగిలి ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని కలికౌండన్‌కోట్టై గ్రామంలో జరిగింది. తన పంటను రక్షించుకునేందుకు గ్రామానికి చెందిన రైతు మురుగేషన్ రెండేళకరాల వ్యవసాయ భూమి చుట్టూ విద్యుత్ తీగలను అమర్చాడు. మొక్కజొన్న, రాగులు, కొబ్బరి పంటలను ఏనుగులు, అడవిపందుల నుంచి రక్షించేందుకు విద్యుత్ స్తంభం నుంచి నేరుగా పంట చుట్టూ విద్యుత్ తీగలను అమర్చాడు.

Read Also: Sukesh Chandrashekhar: బేబీ గర్ల్ నీ కోసం ఎందాకైనా వెళ్తా.. జాక్వలిన్ ఫెర్నాండెజ్‌కు లవ్ లెటర్..

ఇదిలా ఉంటే రాత్రి వేళలో ఆహారం, నీరు వెతుక్కుంటూ వచ్చిన 5 అటవీ ఏనుగులు విద్యుత్ తీగలకు చిక్కుకోగా.. మూడు అక్కడికక్కడే మరణించాయి. రెండు ఏనుగులు ప్రమాదం నుంచి బయటపడ్డాయి. అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న ఏనుగులను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడవిలోకి తిరిగి పంపించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గతేడాది ఇలాగే వ్యవసాయ బావిలో పడి ఓ ఏనుగు, విద్యుత్ఘాతంతో ఓ కూలి మరణించాడు. తాజాగా జరిగిన ఏనుగులు మృతిలో రాయకోట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రైతు మురుగేషన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.