Elephant Trying To Peek Into Phone: మొబైల్ ఫోన్ మనుషులకే కాదు.. ప్రాణులకూ నచ్చేస్తుంది. ఆ మధ్య ఓ వ్యక్తి.. కప్పల వీడియోని కప్పలకు స్మార్ట్ ఫోన్ లో చూపించాడు. అది చూసి కప్పలు బాగా ఎంజాయ్ చేశాయి. సగం వీడియో చూపించాక.. మొబైల్ తీసుకోబోతుంటే.. కప్పలు అతనిపై దాడికి దిగాయి. దీన్ని బట్టి అవి మొబైల్ ఫోన్స్ కు ఎంతలా ఎడిక్ట్ అయిపోయాయో అర్థం చేసుకోవచ్చు.. తాజాగా ఓ ఏనుగుకు సైతం మొబైల్ తెగ నచ్చేసింది. ఫోన్ చూసేందుకు అది పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు.. ఆ ఏనుగు మొబైల్ ఫోన్ చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మధ్య సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఫోన్ లేకపోతే ఉండలేనంత. ప్రతీ దాని కోసం ఆధారపడిపోయే అంతలా.. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్సే కనపడుతున్నాయి. పైగా వయస్సుతో సంబంధం ఏమీ లేదు.. పెద్దల నుంచి పిల్లల వరకు.. పేదవాళ్ల నుంచి ధనికుల వరకూ ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ కి బాగా ఎడిక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇది మనుషులకే కాదు.. జంతువులకు కూడా అలవాటైపోయింది.
Papaya Seeds: బొప్పాయి తిని గింజలు పడేస్తున్నారా? అవి తింటే పురుషులలో వచ్చే..
ఇన్ స్టాగ్రామ్ లో కేరళ ఎలిఫేంట్ అనే పేజీలో ఈ వీడియోని షూర్ చేశారు. ఓ గుడిలో మావటి కూర్చొన్న ఉన్నాడు. ఆయన తన దారిన తాను మొబైల్ చూసుకుంటున్నారు. ఆయనంటే ఎంతో ప్రేమ కలిగి ఉన్న ఓ గజరాజు పక్కనే నిల్చున్నాడు. తన యజమాని ఏం చేస్తున్నాడా అని గమనించిన ఏనుగుకి అతని చేతిలో స్మార్ట్ ఫోన్ పై దృష్టి పడింది. అందులో దృశ్యలు మారుతూ ఉంటే ఆశ్చర్యపోయిన ఏనుగు.. దాన్ని చూసేందుకు కిందకు వంగింది. అక్కడ వీలుగా లేకపోయినా.. ఎడ్జస్ట్ చేసుకుంటూ.. తను కూడా మొబైల్ ని చూడటం స్టార్ట్ చేసింది. ఇది గమనించిన కొందరు తమ మొబైల్ తో వీడియో రికార్డ్ చేశారు.. ఆ వీడియో ఇప్పుడు సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 2.94 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆ మావటి.. తమిళనాడు కుంభకోణంలోని కుంభేశ్వరాలయం దగ్గర కుర్చున్నారని తెలిస్తోంది. దీనిపై నెటిజన్స్ బాగా రియాక్ట్ అవుతన్నారు. ఏనుగు ఫోన్ చూస్తున్న వీడియోపై నెటిజన్స్ తమకు నచ్చినట్లు కామెంట్ప్ చేస్తున్నారు.గజరాజు స్మార్ట్ ఫోన్ చూడటంపై నెటిజన్స్ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. మావటి నీకే కాదు.. నీ ఏనుగుకు కూడా ఓ మొబైల్ ఇప్పించాలి ఒక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Viral Video: బైక్ రైడర్ హెల్మెట్ పగలగొట్టిన ఆటోరిక్షా డ్రైవర్.. ఎందుకో తెలుసా?