NTV Telugu Site icon

Lok Sanha Elections 2024: రేపు మధ్యాహ్నం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

Ec

Ec

Lok Sanha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల కానుంది.

Read Also: Rohit Sharma-IPL 2024: బాధ్యతలు లేవు.. ఐపీఎల్ 2024లో రోహిత్‌ శర్మ రెచ్చిపోతాడా?

ఈసీ ప్రకటించే ఎన్నికల షెడ్యూల్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. బీజేపీ రెండు విడుతలుగా ఇప్పటికే 267 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ 82 మంది పేర్లను ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా వెస్ట్ బెంగాల్‌లో తమ అభ్యర్థులను వెల్లడించింది.

మరోవైపు ఖాళీగా ఉన్న ఈసీ ప్యానెల్‌లోని పోస్టులకు ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నిన్న ప్రధాని నేత‌ృ‌త్వంలోని కమిటీ నియమించింది. సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లు ఈ రోజు ఎలక్షన్ కమిషనర్లుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరు ప్రధాని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కి ఎన్నికల నిర్వహణలో సాయం చేయనున్నారు.