NTV Telugu Site icon

Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ..

Ec

Ec

Delhi Election Schedule: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం.. ఈ ఏడాది తొలి ఎన్నికలు ఢిల్లీలో జరగబోతున్నాయి.. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందన్నారు. ఇక, ఓట్ల తొలగింపు ఆరోపణలను సైతం ఖండించారు. ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.

Show comments