Site icon NTV Telugu

సీఈసీ కీలక నిర్ణయం.. ఈనెల 22 వరకు నిషేధాజ్ఞలు పొడిగింపు

త్వరలో దేశంలోని పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఒకపక్క కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలలో ర్యాలీలు, రోడ్ షోలపై ఎన్నికల కమిషన్ నిషేధం పొడిగించింది. గతంలో ఈనెల 15 వరకు నిషేధం విధించగా.. తాజాగా ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధాన్ని ఈనెల 22 వరకు పొడిగిస్తున్నట్లు శనివారం నాటి సమీక్ష అనంతరం వెల్లడించింది.

Read Also: వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులకే స్కూళ్లలోకి అనుమతి

అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలలో మరో వారం పాటు సభలు, రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై నిషేధం అమల్లో ఉంటుందని కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇండోర్ సభల్లో 300 మందికి మించి పాల్గొనరాదని ఈసీ స్పష్టం చేసింది. సభలు, సమావేశాల్లో 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

Exit mobile version