వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులకే స్కూళ్లలోకి అనుమతి

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులనే స్కూళ్లలోకి అనుమతిస్తామని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. ఈ మేరకు 15-18 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అలా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే స్కూళ్లకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read Also: పంది గుండెతో మొదటి ప్రయోగం మనవాడిదే… కానీ!

కరోనా కారణంగా ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం స్కూళ్లను మూసివేసింది. స్కూళ్లను ఓపెన్ చేసిన తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారినే అనుమతించాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల లోపు యువతకు కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తుండగా… హర్యానాలో ఇప్పటివరకు 15 లక్షల మంది విద్యార్థులు టీకాలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Related Articles

Latest Articles