మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైకి కింగ్ మేకర్ అవుతారనుకున్న ఏక్ నాథ్ షిండే సీఎం కానున్నారు. ఆయనే కింగ్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. రాత్రి ఏడున్నరకు ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు.. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. తాను ప్రభుత్వానికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది భారీ ట్విస్ట్ గా చెప్పవచ్చు. ఉద్ధవ్ ఠాక్రే సర్కారును కుప్పకూల్చిన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ఏకంగా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. రాత్రి ఏడున్నర గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో రాష్ట్రంలో సర్కారు కుప్పకూలగా.. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఉన్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లభించింది.
మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. భారీ ఎత్తున నినాదాలు చేశారు బీజేపీ నేతలు, కార్యకర్తలు.
సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగనున్నారు. తొలుత మేం ప్రభుత్వంలో చేరబోమన్నారు. అమిత్ షా సూచన మేరకు ఫడ్నవీస్ అందుకు ఒప్పుకున్నారని అంటున్నారు. రాబోయే రోజుల్లో పాలనా పరమయిన ఇబ్బందులు వచ్చినా షిండేని నడిపించేది ఫడ్నవీస్ అని అంటున్నారు. నడ్డా కోరినప్పుడు ఒక రకమయిన వాదన వినిపించారు ఫడ్నవీస్. అసలేం జరిగిందనేది త్వరలో తేలనుంది.
దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పీఠం కాదని తనకు అవకాశం ఇచ్చారని ఏక్ నాథ్ షిండే అన్నారు. బాలాసాహెబ్ సైనికుడిని సీఎం పదవిలో కూర్చోబెడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు. 40 మంది శివసేన ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని.. వారి మద్దతుతోనే ఈ పోరాటంలో విజయం సాధించానని షిండే చెప్పారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గతంలో నియోజకవర్గాల అభివృద్ధి నిమిత్తం కలిశామని, ఆ సమయంలో ఆయన వైఖరి చూసి వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమని తమకు అవగతమైందని ఏక్‌నాథ్ షిండే అన్నారు. మొత్తం మీద ఆటో డ్రైవర్ రూలర్ గా మారిన వైనం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
2019లో బీజేపీ, శివసేన కూటమికి ప్రజలు అధికారం అప్పగించారు. కానీ, శివసేన మాత్రం బాలాసాహెబ్ తన జీవితాంతం వ్యతిరేకించిన వారితోనే కూటమి ఏర్పాటు చేసుకుందన్నారు మాజీ సీఎం ఫడ్నవీస్. హిందుత్వ, సావార్కర్ వ్యతిరేకులైన వారితో శివసేన చేయి చేయి కలిసింది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించింది. అందుకే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నుంచి దూరం జరగాలని శివసేన రెబల్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కానీ ఉద్ధవ్ థాకరే వాటిని పట్టించుకోలేదు. అఘాడీ కూటమికే ప్రాధాన్యం ఇవ్వడంతో వారు తిరుగుబాటు చేశారు. అందుకే, సేన ఎమ్మెల్యేలు తమ గళాన్ని గట్టిగా వినిపించాలనుకున్నారు. ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని భావించారు కానీ బీజేపీ వ్యూహాత్మకంగా సీఎం పీఠం ఇచ్చేసింది.
దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగం కావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆయనకు వ్యక్తిగత అభ్యర్థన చేసిందన్నారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టాలని కేంద్ర నాయకత్వం చెప్పిందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్ షిండేకు కేటాయిస్తూ భాజపా సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవాలోని హోటల్ లో బసచేస్తున్న షిండే తరఫు ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకుంటున్నారు. ఏక్‌నాథ్ షిండేను సీఎంగా ప్రకటించడంతో 10 మంది శాసనసభ్యులు చిందులు వేస్తూ ఉత్సాహంగా కనిపించారు.
#WATCH | Eknath Shinde-faction MLAs, staying at a hotel in Goa, celebrate following his name being announced as the Chief Minister of Maharashtra. pic.twitter.com/uJVNa4N74g
— ANI (@ANI) June 30, 2022
ఏక్ నాథ్ షిండే 1964 ఫిబ్రవరి 9 న జన్మించారు. ఆయనకు ఒక్కరే సంతానం కొడుకు పేరు శ్రీకాంత్ షిండే. ఆయన యశ్వంతరావు చవాన్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఏక్‌నాథ్ షిండే 1980లో శివసేన పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1997లో జరిగిన థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆయన 2004లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి - పచ్చపాఖాది నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏక్‌నాథ్ షిండే ఆ తరువాత 2009, 2014, 2019లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పని చేసి 28 నవంబర్ 2019 నుండి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా-వికాస్- అఘాడీ ఆధ్వర్యంలో పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. శివసేన పార్టీపై అసంతృప్తితో తిరుగుబాటు చేయడంతో 2022 జూన్ 21న శివసేన పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు. అసోంలో రెబల్ ఎమ్మెల్యేలతో ఆయన క్యాంప్ నడిపారు.
ఈ మధ్యాహ్నం ఫడ్నవీస్, ఏక్ నాథ్ కలిసి గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ తమకు ఉందని, అందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ని కోరారు. ఈ సాయంత్రం 7.30 గంటలకు రాజ్‌భవన్‌లో శిందే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఫడ్నవీస్ వెల్లడించారు. ఇది రాజకీయాల్లో అనూహ్య నిర్ణయం అని చెప్పాలి. అధికారం కోసం బీజేపీ కుయుక్తులు పన్నుతోందని ఆపద్ధర్మ సీఎం ఉద్ధవ్ థాకరే ఆరోపించిన సంగతి తెలిసిందే. అయినవారే వెన్నుపోటు పొడిచారని ఆయన కామెంట్ చేశారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమిపై ఏక్‌నాథ్ శిందే వర్గం తిరుగుబాటుతో నెలకొన్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి దీంతో తెరపడింది. నిన్న సీఎం పదవికి రాజీనామా చేశారు ఉద్ధవ్. బలపరీక్షకు ముందే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం గమనార్హం.
ఉద్ధవ్ పదవి నుంచి దిగిపోవడంతో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఊహాగానాలు వినిపించాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఈ మధ్యాహ్నం ఏక్ నాథ్ షిండే గోవా నుంచి ముంబయి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫడ్నవీస్ నివాసానికి వెళ్లారు. అనంతరం వీరిద్దరూ కలిసి రాజ్‌భవన్‌ను వెళ్లి గవర్నర్‌ను కలిశారు. మహారాష్ట్ర గవర్నర్ తో ముగిసిన భేటీ. దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్ నాథ్ షిండేకి స్వీట్స్ తినిపించారు గవర్నర్.
ఉద్ధవ్ ఠాక్రే సర్కారును కుప్పకూల్చిన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ఏకంగా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. రాత్రి ఏడున్నర గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో రాష్ట్రంలో సర్కారు కుప్పకూలగా.. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఉన్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లభించింది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని భావించిన వారికి ఇది ఊహించని పరిణామం. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండేతో కలిసి గవర్నర్ ని కలిశారు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అంతా భావించారు. ఏక్ నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి అవుతారని భావించారు. కానీ షిండేకు అనూహ్యంగా ప్రమోషన్ లభించింది. ఏకంగా సీఎం పదవిని అప్పగిస్తూ సంచలన ప్రకటన చేశారు ఫడ్నవీస్. తాను ప్రభుత్వానికి దూరంగా ఉండనున్నట్లు మరో సంచలన విషయం వెల్లడించారు