NTV Telugu Site icon

Excise Policy Probe: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై మనీలాండరింగ్ కేసు

Manish Sisodia

Manish Sisodia

Excise Policy Probe: 2021-22 ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసిన కొద్ది రోజులకే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిసోడియాపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఆ తర్వాత ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకున్నారు.

Ministry of Law: ఇకపై సుప్రీం మాజీ సీజేఐకి ఢిల్లీలో ఉచిత బంగ్లా, భద్రత, డ్రైవర్

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి సంబంధించి సీబీఐ గత వారం సిసోడియా అధికారిక నివాసంలో సోదాలు నిర్వహించింది. అనేక ఇతర ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. ఎఫ్‌ఐఆర్‌లో సిసోడియాతో పాటు మరో 14 మంది పేర్లు ఉన్నాయి. ఢిల్లీలో అధికార పార్టీ అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తే, అవినీతి ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని ఆప్ సమర్థించింది. ఈ అంశంపై విచారణకు కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది.

Show comments