NTV Telugu Site icon

ED Raids: తమిళనాడులో ఈడీ సోదాలు.. ఆ మంత్రే టార్గెట్!

Ed

Ed

ED Raids: తమిళనాడు రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మంత్రి కేఎన్‌ నెహ్రు, ఆయన కుమారుడు, ఎంపీ అరుణ్ నెహ్రూకు సంబంధించిన ఇళ్లతో పాటు చెన్నైలోని 10 ప్రాంతాలతో పాటు అడయార్‌, తేనాంపేట, సిఐటి కాలనీ, ఎంఆర్‌సి నగర్‌ తదితర ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో, ఇరు నేతల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వారి నివాసాల దగ్గరకు చేరుకున్నారు.

Read Also: Court : ‘కోర్ట్’ మూవీ OTT స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన..!

అయితే, వివరాల్లోకి వెళితే.. తమిళనాడు మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ ఇళ్లలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఈరోజు (ఏప్రిల్ 7న) తెల్లవారుజామునే జాతీయ దర్యాప్తు బృందం.. నెహ్రుకు సంబంధించిన నివాసాలకు చేరుకున్నారు. అయితే, మంత్రి నెహ్రూ సోదరుడు ఎన్. రవిచంద్రన్ కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ట్రూ వాల్యూ హోమ్స్‌లో ఆర్థిక అవకతవకలకు జరిగినట్లు ఈడీ అధికారులు సమాచారం రావడంతో.. రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దానికి సంబంధించి సోదాలు చేస్తుంది. టీవీహెచ్ 1997లో స్థాపించారు.. రాష్ట్రంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా గుర్తింపు పొందింది.