Site icon NTV Telugu

Sonia Gandhi: సోనియాగాంధీకి ఈడీ తాజా సమన్లు.. విచారణ తేదీలో మార్పు

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని రెండో విడత విచారించనున్న తేదీని ఈ నెల 25 కాకుండా 26కు మార్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెల్లడింటారు. ఈ మేరకు సోనియాకు ఈడీ తాజా సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ధ్రువపరిచారు. 25న తమకు వీలు కాదని, అందువల్ల వేరే తేదీన విచారణకు రావాలని ఈడీ కోరినట్లు ఆయన తెలిపారు.

West Bengal: మంత్రి సన్నిహితురాలి ఇంట్లో రూ. 20 కోట్లు.. ఈడీ దాడుల్లో పట్టుబడిన నగదు

మారిన షెడ్యూల్‌ ప్రకారం సోనియాగాంధీ ఈ నెల 26న విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. వాయిదాకు కారణాలేమిటనేది వివరాలు తెలపకపోవడం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడిన అభియోగంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వరుసగా విచారిస్తున్న విషయం తెలిసిందే. గురువారం సోనియాగాంధీని ఈడీ అధికారులు దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు.

Exit mobile version