ECI SIR Meeting: కేంద్రం ఎన్నికల సంఘం కీలక సమావేశం శనివారం నిర్వహించింది. కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయనే మీడియా నివేదిలక నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎస్ఐఆర్ అభ్యంతరాలపై నవంబర్ 30వ వరకు గడువు పొడగిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీ హాజరయ్యారు.
శనివారం న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో ఈ సమావేశం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియపైనే ఈ భేటీ జరిగింది. ఢిల్లీలో ఎస్ఐఆర్ అభ్యంతరాలపై గడువును అక్టోబర్ 30 వరకు, మహారాష్ట్రలో అక్టోబర్ 12 వరకు గడువు పెంచింది. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న వారు బీఎల్ఓలను కలవాల్సిన అవసరం లేదని ఈసీ ప్రకటించింది. బీఎల్ఓలే ఓటర్ల ఇంటికి వస్తారని ప్రకటించింది. సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తారని చెప్పింది. నోటీసులు అందుకున్న ఓటర్లకు ఇబ్బంది లేకుండా సులభతర విధానాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
ఎస్ఐఆర్, ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు వంటి అంశాల్లో కమిషనర్ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ముగ్గురు కమిషనర్లు ఎస్ఐఆర్‌పై సమావేశం నిర్వహించడంతో ఈ ఊహాగానాలకు చెక్ పెట్టినట్లు అయింది. మరోవైపు, ప్రతిపక్షాలు ఈసీ పనితీరు, CEC జ్ఞానేష్ కుమార్ వైఖరికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. CEC రాజీనామా చేయాలని కాంగ్రెస్, సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నెల 30న ఇండియా కూటమి కీలక సమావేశానికి పిలుపునిచ్చింది.

