EC: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో నగదు ప్రవాహం.. రూ.558 కోట్లు సీజ్!
- మహారాష్ట్ర.. జార్ఖండ్‌లో నగదు ప్రవాహం
- రూ.558 కోట్లు సీజ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో నగదు ప్రవాహంలాగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో విచ్చలవిడిగా డబ్బు కట్టలు తరలిస్తున్నారు. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరగనున్న రెండు లోక్‌సభ సీట్లు, 48 అసెంబ్లీ స్థానాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 6 వరకు మొత్తంగా రూ.558.67 కోట్లు విలువైన నగదు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సీజ్ చేసిన దాంట్లో రూ.92.47 కోట్లు నగదు కాగా.. రూ.52.76 కోట్ల విలువ చేసే మద్యం, రూ.68.22 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.104.18 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.241.02 కోట్ల విలువైన ఉచితాలు, ఇతర వస్తువులు ఉన్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Hyderabad: పసికందు కిడ్నాప్‌కు యత్నం.. మహిళ అరెస్ట్
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
ఆయా రాష్ట్రాల్లో మొత్తంగా రూ.558.67 కోట్లు సీజ్ చేయగా.. ఇందులో మహారాష్ట్రలో రూ.280 కోట్లు.. జార్ఖండ్‌లో రూ.158 కోట్లు సీజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీజ్ చేసిన మొత్తం 3.5 రెట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. జార్ఖండ్‌లో నవంబర్ 13న తొలి విడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: వ్యాపార వ్యతిరేకిని కాను.. రాహుల్ వీడియో పోస్ట్
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!