బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారి పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని.. 65 లక్షల ఓట్లను తొలగించిందంటూ విపక్ష పార్టీలు ఆరోపించాయి. పార్లమెంట్ వేదికగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. అంతేకాకుండా ఇటీవల ఢిల్లీ వేదికగా రాహుల్‌గాంధీ ప్రత్యేక విందు ఏర్పాటు చేసి ఓట్ల కుట్రపై ప్రజెంటేషన్స్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్: నా ఫోన్, సీఎం రేవంత్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు
తాజాగా ఇదే అంశంపై ఎన్నికల సంఘం స్పందించింది. బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై రాజకీయ పార్టీలు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు గానీ అభ్యంతరాలు సమర్పించలేదని వెల్లడించింది. ఓటర్ల జాబితా ప్రకటించిన దగ్గర ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Dowry Harassment: రూ.10 లక్షలు వరకట్నం, కారు కోసం భర్త అమానుషం.. భార్యను కొడుతూ.. వైరల్ వీడియో
జూలై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీహార్‌లో జరుగుతున్న ఓట్ల ప్రత్యేక సర్వేపైనే సభలో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలను ఈసీ ఖండించింది. అనర్హులైన ఓటర్ల పేర్లనే తొలగిస్తున్నట్లు తెలిపింది.
