Site icon NTV Telugu

Rahul Gandhi-EC: ఆరోపణలపై పత్రాలు ఇవ్వండి.. రాహుల్‌గాంధీని కోరిన ఈసీ

Ec

Ec

ఎన్నికల సంఘంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారు. ఇటీవల ఇండియా కూటమికి విందు ఇచ్చిన సందర్భంగా ఈసీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం బెంగళూరు వేదికగా ధర్నా కూడా చేపట్టారు. ఇంకోవైపు రాజధాని ఢిల్లీ వేదికగా పార్లమెంట్‌లో పోరాడుతున్నారు. అన్ని వైపుల నుంచి ఎన్నికల సంఘం వార్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Emma Thompson: విడాకులు తీసుకున్న రోజున ట్రంప్ అలా చేశాడు.. సంచలన విషయం బయటపెట్టిన నటి

ఇక గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలో జరిగిన ఓటర్ మోసాన్ని బయటపెట్టారు. శకున్ రాణి అనే ఓటర్ రెండు సార్లు ఓటు వేసినట్లుగా తెలిపారు. భిన్నమైన ఫొటోలు, స్పెల్లింగ్‌లతో ఉన్నాయని.. రెండు చోట్ల ఓటు వేసినట్లుగా పేర్కొ్న్నారు. అయితే టిక్ మార్క్ ఉన్న కాగితాన్ని పోలింగ్ అధికారి జారీ చేయలేదని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే విచారణలో శకున్ రాణి ఒక్కసారి మాత్రమే ఓటు వేశానని చెప్పిందని ఎన్నికల సంఘం పేర్కొంది. టిక్ మార్క్ ఉన్న పత్రాన్ని పోలింగ్ అధికారి జారీ చేయలేదని.. రాహుల్ గాంధీ వాదనకు విరుద్ధంగా ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పింది. ఇందుకు సంబంధించిన పత్రాలను తమకు అందజేయాలని ఎన్నికల సంఘం కోరింది. దీనిపై వివరణాత్మక విచారణ చేపడతామని ఈసీ లేఖలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Sai Durga Tej : తెలుగులో స్టైలిష్ హీరో అతనే.. సాయిదుర్గ తేజ్ కామెంట్స్

త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా 65 లక్షల ఓట్లను తొలగించింది. దీంతో విపక్షాలు ధ్వజమెత్తాయి. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం ఓట్లు తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండిస్తోంది. తనిఖీలు చేశాకే ఓట్లు తొలగించినట్లు చెప్పింది.

Exit mobile version