Site icon NTV Telugu

Earthquake: ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో వరస భూకంపాలు..

Earthquake

Earthquake

Earthquake: దేశంలో ఇటీవల కాలంలో పలు చోట్ల భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన భూకంపం ధాటికి ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ లో 4.1 తీవ్రతతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. సూరజ్‌పూర్‌లోని భట్‌గావ్‌ ప్రాంతంలో భూమికి 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు.

Read Also: Manchu Family: రోడ్డునపడ్డ ఇంటి గుట్టు… మంచు మనోజ్ అనుచరుడిపై మంచు విష్ణు దాడి

శుక్రవారం ఉదయం 10.31 గంటలకు 4.0 తీవ్రతతో మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో భూకంపం సంభవించింది. గ్వాలియర్‌కు ఆగ్నేయంగా 28 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం ఉదయం 10:31 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ రెండు భూకంపాలు తక్కువ తీవ్రతవే కావడంతో భూ ప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదు.

ఇక హిమాలయ పర్వత ప్రాంతాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఏదో రోజు 8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ క్రమంగా ఉత్తరం వైపుగా కదులుతూ యూరేషియా ప్లేట్ ను నెడుతోంది. దీంతో ఈ శక్తి మొత్తం భూకంపం రూపంలో బయటకు వస్తోంది.

Exit mobile version