Site icon NTV Telugu

Pakistan Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రత..

Earthquake

Earthquake

Pakistan Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున 1.44 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూకంప వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(NCS) వెల్లడించింది. ఇటీవల పాకిస్తాన్‌లో సంభవించిన భూకంపాల్లో ఇది నాలుగవది. మే 5న 4.2 తీవ్రతో భూకంపం వచ్చింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో భూకంప కేంద్రం ఉంది.

Read Also: India Pakistan War: భారత్, బీఎల్ఏ, తాలిబాన్లు.. పాకిస్తాన్‌పై ముప్పేట దాడి..

పాకిస్తాన్ యురేషియన్,ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల కలిసే ప్రదేశంలో ఉంది. ఇది తరచుగా శక్తివంతమైన భూకంపాల సంభావ్యతను పెంచుతుంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలు యురేషియన్ ప్లేట్ దక్షిణ అంచున ఉండటం వల్ల భూకంపాలకు గురవుతున్నాయి.

Exit mobile version