Site icon NTV Telugu

Earthquake: జమ్మూ కాశ్మీర్ లో వరసగా తొమ్మిది భూకంపాలు.. పొంచి ఉన్న ప్రమాదం

Earthquake

Earthquake

Back-To-Back Earthquakes Hits Jammu Kashmir: జమ్మూాకాశ్మీర్ లో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాలయ రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే ఇలా వరసగా భూకంపాలు రావడం ముందస్తు ప్రమాదాన్ని సూచిస్తోందని చెబుతున్నారు నిపుణులు. ఈ వారంలో వరసగా తొమ్మది భూకంపాల రావడం మాత్రం చాలా అరదనే చెప్పవచ్చు. ఈ వారంలో 4.1,3.2 తీవ్రతతో తొమ్మిది వరస భూకంపాలు వచ్చాయి. 60 గంటల్లోనే ఈ భూకంపాలు సంభవించాయి. దీంతో అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాజాగా బుధవారం రాత్రి 11.52 గంటల ప్రాంతంలో తొమ్మిదో భూకంప 3.1 తీవ్రతతో జమ్మూ కాశ్మీర్ డోదాలో సంభవించింది. మంగళవారం ఆరు భూకంపాలు జమ్మూ కాశ్మీర్ ప్రజలను కలవరపెట్టాయి. అంతకు ముందు బుధవారం రాత్రి 11.04 గంటలకు 4.1 తీవ్రతతో కాట్రాలో భూకంపం వచ్చింది. కత్రా, దోడా, ఉదంపూర్, కిష్ట్ వార్ జిల్లాల్లో భూప్రకంపనుల సంభవించాయి.

Read Also: Somanathan Committee Meet: విభజన సమస్యలపై సోమనాథన్ కమిటీ భేటీ

జమ్మూ కాశ్మీర్ ప్రాంతంల అత్యంత తీవ్రమైన భూకంప ప్రభావిత జోన్ లో ఉంది. హిమాలయ ప్రాంతంలో ఇటీవల కాలంలో టెక్టానిక్ ప్లేట్ల కదలిక చురుకుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రకంపనలు మరన్ని వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా పెద్ద భూకంపం సంభవించే అవకాశాన్ని చెప్పారు జమ్మూ యూనివర్సిటీ భూగర్భ శాస్త్రవేత్ జీఎం భట్. సాధారణంగా పెద్ద భూకంపానికి ముందు చిన్నచిన్నవి ఇలాగే సంభవిస్తాయని ఆయన వెల్లడించారు.

2013లో చివరిసారిగా 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అంతకుముందు 1962లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కార్యకలాపాలు ఈ ప్రాంతంలో నిరంతర ప్రక్రియ అని.. భట్ అన్నారు. మూడు రోజుల్లో వరసగా తొమ్మిది సంఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. అక్టోబర్ 2005లో 7.3 తీవ్రతతో భారత్, పాక్ సరిహద్దుల్లో వచ్చిన భూకంపంతో 73,000 మందికి పైగా మరనించారు. 1935 తర్వాత దక్షిణాసియాలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపంగా ఇది నిలిచిపోయింది.

Exit mobile version