EAM Jaishankar comments on Pakistan: విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో దూసుకెళ్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఇంటర్నేషనల్ టెర్రరిజం(ఐటీ)లో ఎక్స్‌పర్ట్ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ వడోదరలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇప్పడు ప్రపంచం ఉగ్రవాదంపై గతం కన్నా మెరుగైన అవగాహనతో ఉందని ఆయన అన్నారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించదని.. ఇప్పడు తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశాలు ఒత్తడిలో ఉన్నాయని ఆయన అన్నారు.
భారతదేశంపై తీవ్రవాదం కొన్ని ఏళ్లుగా కొనసాగుతోందని.. అయితే దీని గురించి ప్రపంచానికి వివరించడంలో భారత్ విజయవంతం అయిందని ఆయన అన్నారు. ఇటీవల అమెరికాలో పాకిస్తాన్ గురించి జైశంకర్ ఇదే రకంగా స్పందించారు. అమెరికా, పాకిస్తాన్ కు ఎఫ్-16 విమానాల డీల్ పై ఆయన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మొహం మీదే ‘మీరు ఎవరిని ఫూల్స్ చేయలేరు’ అంటూ తీవ్రస్వరంతో మాట్లాడారు. పాకిస్తాక్ కు ఎఫ్ -16 ఇస్తే ఏం చేస్తుందో అందరికి తెలుసని ఆయన అన్నారు.
Read Also: Megastar Chiranjeevi: దండేసి గొర్రె పొట్టెల్ని బలికి తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారు
ఇదిలా ఉంటే పాకిస్తాన్ కు ఇస్తున్న సాయం కేవలం ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకే అని అమెరికా చెబుతోంది. అయితే ఇది భారత్ కు వ్యతిరేకంగా కాదని అంటోంది. పాకిస్తాన్, అమెరికా సంబంధాల వల్ల ఇరు దేశాలకు ఎలాంటి ప్రయోజనం ఉండని జైశంకర్ వ్యాఖ్యానించారు. అమెరికా పాలసీలను రూపొందిస్తున్న వారితో మాట్లాడాల్సి వస్తే ఇది మీకు ఎంత మాత్రం ప్రయోజనం కానది చెబుతా అని.. జైశంకర్ అన్నారు.
ఇదిలా ఉంటే గతంలో కూడా ఉగ్రవాదం పేరుతో పాకిస్తాన్, అమెరికా నుంచి భారీగా నిధులను సేకరించింది. అయితే అది ఉగ్రవాదానికి వ్యతిరేకం కన్నా.. భారత్ వ్యతిరేకతకే ఎక్కువగా ఉపయోగించుకుంది. గతంలో అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో పాకిస్తాన్ కు ఇస్తున్న 200కోట్ల డాలర్ల భద్రతా సాయాన్ని నిలిపివేసింది. అయితే మళ్లీ జోబైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత పాకిస్తాన్ తో సంబంధాలు పునరుద్ధరించుకుంటుంది అమెరికా.
