E20 protest: E20 పెట్రోల్‌‌కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..

  • దేశంలో తొలిసారి E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా నిరసన..
  • హమారా, హమారీ అధికార్ నినాదంతో కార్యక్రమం..
E20 Petrol (1)

E20 Petrol (1)

E20 protest: ఇథనాలు కలుపుతున్న E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా తొలిసారిగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాహనాదారులు ఆందోళన చేపట్టారు. ‘‘హమారీ గాడీ, హమారీ అధికార్’’ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువరు వాహనదారులు హాజరయ్యారు. E20 పెట్రోల్ వాడటం వల్ల తమ వాహనాల మైలేజ్ తగ్గడంతో పాటు ఇంధన వ్యవస్థ దెబ్బతింటోందని వారు ఆరోపించారు. పారిశ్రామికవేత్త తేహ్సీన్ పూనావాలా ఆధ్వర్యంలో టీమ్ భారత్ ఈ నిరసనను నిర్వహించింది. తమ ఉద్యమానికి రాజకీయ రంగు లేదని, తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని, కేవలం విధానంపై మాత్రమే అభ్యతరం తెలుపుతున్నామని నిరసనకారులు చెప్పారు.

ఇదిలా ఉంటే వాహనదారుల ఆరోపణల్ని కేంద్రం ఖండిస్తోంది. ఆటోమొబైల్, ఇంధనరంగ నిపుణులు కూడా E20పై నిర్వహించిన టెస్టుల్లో వాహనాలపై ప్రభావానికి స్పష్టమైన ఆధారాలు లేవని చెబుతున్నారు. ఇథనాల్ కలపడం వల్ల పెట్రోలియం దిగుమతి తగ్గడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం చెబుతోంది. మరోవైపు, నిరసనకారులు మాత్రం E20 పెట్రోల్‌తో పాటు సాధారణ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారులకు తమకు ఇష్టమైన పెట్రోల్ ఎంచుకునే హక్కు ఇవ్వాలని కోరుతున్నారు.