DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో సత్తా చాటిన దీపాంశు షోకీన్..
- చెప్పులు లేకుండా ప్రచారం, స్వతంత్ర అభ్యర్థిగా ఘన విజయం..
- ఏబీవీపీ ప్రభజనం, ఎన్ఎస్యూఐ పోటీని తట్టుకుని సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DUSU Elections 2026: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (DUSU) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) సంచలన విజయం నమోదు చేసింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో కాంగ్రెస్ మద్దతు ఉన్న NSUI చతికిలపడింది. మొత్తం నాలుగు పోస్టుల్లో మూడింటిని ఏబీవీపీ కైవసం చేసుకుంది. అధ్యక్ష, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టుల్ని గెలుచుకుంది. అయితే, ఈ ఎన్నికల్లో మరో సంచలనం నమోదైంది. ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దీపాంశు షోకీన్ గెలుచుకున్నారు. భారీ మెజారిటీతో ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ అభ్యర్థిని ఓడించారు. విద్యార్థి సంఘ చరిత్రలోనే ఈ పదవిని గెలుచుకున్న తొలి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు.
ఢిల్లీ యూనివర్సిటీ అధ్యక్ష పదవిని యశ్ దాబాస్ సొంతం చేసుకున్నారు. సెక్రటరీగా రియా చబాడి, జాయింట్ సెక్రటరీగా లక్ష్య రాజ్ సింగ్ విజయం సాధించారు. వీరు ముగ్గురు ఏబీవీపీకి చెందినవారే.
Also Read
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
చెప్పులు లేకుండా ప్రచారం..
చెప్పులు లేకుండా ఎన్నికల ప్రచారంలో దిగిన దీపాంశు అందరి దృష్టిని ఆకర్షించారు. విద్యార్థి సమస్యలు, జవాబుదారీతనం, న్యాయం కోసం పోరాడుతానని హామీలు ఇచ్చారు. ఇటీవల, సత్య నికేతన్ ప్రైవేట్ హాస్టల్ కూలిన ఘటనలో పలువురు విద్యార్థులు మరణించారు. దీని తర్వాత, వారికి న్యాయం జరిగే వరకు చెప్పులు ధరించనని ప్రతిజ్ఞ చేసినట్లు చెప్పారు.
ఎవరు ఈ దీపాంశు షోకీన్..
ఏబీవీపీ హవా, ఎన్ఎస్యూఐ పోటీని తట్టుకుని నిలబడిన దీపాంశు షోకీన్ ఢిల్లీ యూనివర్సిటీలో డిపార్టమెంట్ ఆఫ్ బుద్దిస్ట్ స్టడీస్‌లో చదువుతున్నారు. ఆయన ఢిల్లీలోని పీరాగఢి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి బస్ కండక్టర్ కాగా, తల్లి అంగన్వాడీ కార్యకర్త. విద్యార్థి రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో దీపాంశు ఉండగా, ఆయన తండ్రి మాత్రం తన కొడుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలకు సిద్ధం కావాలని కోరుతున్నారు.
NSUI హ్యాండిచ్చినా, విజయం సాధించారు..
దీపాంశు ముందుగా ఎన్ఎస్యూఐ నుంచి పోటీ చేయాలని భావించారు. టికెట్ కోరారు. అయితే ముందుగా టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ, చివరి నిమిషంలో ఉపసంహరించుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి సత్తా చాటారు. తనకు పెద్ద పెద్ద వాహనాలు, పలుకుబడి లేదా ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేసే ఆర్థిక సామర్థ్యం లేదనే అంశాలతో తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!