Site icon NTV Telugu

DUSU election: రాహుల్ గాంధీకి స్టూడెంట్స్ షాక్.. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP ఘనవిజయం..

Dusu Election Result 2025

Dusu Election Result 2025

DUSU election: కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు భారీ షాక్ ఇచ్చారు. దేశంలో ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్(DUSU) ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి సంఘం(ABVP) సత్తా చాటింది. నాలుగు టాప్ పోస్టుల్లో మూడింటిని గెలుచుకుంది. కాంగ్రెస్ విద్యార్థి సంఘం-స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) కేవలం వైస్ ప్రెసిడెంట్ స్థానాన్ని గెలుచుకుంది. ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలపై నిన్న రాహుల్ గాంధీ జెన్-జీ యువతను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అయితే, తాజాగా నెటిజన్లు ఢిల్లీ వర్సిటీ ఎన్నికల ఫలితాలను చూస్తే యువత బీజేపీ వైపే ఉన్నట్లు అర్థమవుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

ఏబీవీపీకి చెందిన ఆర్యన్ మాన్ అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. ఎన్ఎస్‌యూఐకి చెందిన జోస్లిన్ చౌదరిపై భారీ తేడాతో గెలుపొందారు. ఇదే విధంగా ఏబీవీపీకి చెందిన కునాల్ చైదరి, , దీపికా ఝాలు కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ పదవుల్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న ఎన్‌ఎస్‌యూఐ కేవలం ఉపాధ్యక్ష పదవిని గెలుచుకుంది. రాహుల్ ఘన్‌స్లాపై వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందారు.

Read Also: Sam Pitroda: ‘‘పాకిస్తాన్ వెళ్లాను, ఇంట్లో ఉన్నట్లు ఉంది’’.. రాహుల్ గాంధీ సన్నిహితుడు..

ఏబీవీపీకి చెందిన ఆర్యన్ మాన్ 28,841 ఓట్లు సాధిస్తే, ఎన్‌ఎస్‌యూఐకి చెందిన జోస్లిన్ చౌదరి 12,645 ఓట్లు సాధించారు. ఎస్ఎఫ్ఐ-ఏఐఎస్ఏ అభ్యర్తి 5,385 ఓట్లు పొందారు. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో యూనివర్సిటీ ఆధ్వర్యంలోని 50కి పైగా కాలేజీలకు చెందిన 2.75 లక్షల మంది విద్యార్థులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 195 బూత్‌లతో 52 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. 711 ఈవీఎం యంత్రాలను వాడారు.

కీలక విజేతలు:

అధ్యక్షుడు: ఆర్యన్ మాన్ (ABVP)

వైస్ ప్రెసిడెంట్: రాహుల్ ఝాన్స్లా (NSUI)

కార్యదర్శి: కునాల్ చౌదరి (ABVP)

జాయింట్ సెక్రటరీ: దీపికా ఝా (ABVP)

Exit mobile version