Site icon NTV Telugu

Droupadi Murmu: ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన యుద్ధ విమానంలో రాష్ట్రపతి గగన విహారం

Droupadi Murmu

Droupadi Murmu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం గగన విహారం చేశారు. అంబాలా వైమానిక దళ కేంద్రం నుంచి రాఫెల్ యుద్ధ విమానంలో విహరించారు. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌పై భారత్ ప్రయోగించిన రాఫెల్ విమానంలోనే రాష్ట్రపతి ప్రయాణించారు. ద్రౌపది ముర్ము యుద్ధ విమానంలో విహరించడం ఇదే రెండోసారి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Khawaja Asif: ‘కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ’.. పాక్ మంత్రి ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్వయంగా రాఫెల్ విమానాన్ని నడిపారు. అంతకుముందు అంబాలా వైమానిక దళ కేంద్రంలో ముర్ముకు గౌరవ వందనం సమర్పించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారతదేశం ఈ రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగించింది.

ఇది కూడా చదవండి: Trump Dance: జపాన్‌లోనూ మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టిన ట్రంప్.. వీడియో వైరల్

ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్‌లను 2020 సెప్టెంబర్‌లో అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో అధికారికంగా భారత వైమానిక దళంలో చేరాయి. ఈ విమానాలు జూలై 27, 2020న ఫ్రాన్స్ నుంచి వచ్చాయి.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆ యుద్ధంలో రాఫెల్ జెట్‌లను భారత్ ప్రయోగించింది. దీంతో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అనంతరం మే 10న ఇరు దేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది.

Exit mobile version