జమ్మూకాశ్మీర్‌లో డ్రోన్‌లు కలకలం రేపుతున్నాయి. గత కొన్నిరోజులుగా పాక్ వైపు నుంచి భద్రతా బలగాల కళ్లుగప్పి ఇండియాలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కీలకమైన భద్రతాబలగాల స్ధావరాలు లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో జమ్మూకాశ్మీర్ లో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఇక పాక్ బోర్డర్‌లో సెక్యూరిటీని పెంచారు.
Read: అనాధాశ్రమంలో 16 మంది పిల్లలు మాయం…
అయినప్పటికి భధ్రతా బలగాల కళ్లుగప్పి ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు అర్నియా సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి ఓ డ్రోన్ ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేసింది. పాక్ వైపు నుంచి వస్తున్న డ్రోన్‌గా గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే డ్రోన్‌పై కాల్పులు జరిపాయి. అయితే, ఆ డ్రోన్ కాల్పుల నుంచి తప్పించుకొని వెనక్కి వెళ్లిపోయింది. రెక్కీ నిర్వహించేందుకు ఈ డ్రోన్‌ను వినియోగించి ఉంటారని భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
