Site icon NTV Telugu

Bengaluru Video: బస్సులో కొట్టుకున్న డ్రైవర్‌-మహిళా ప్రయిణికురాలు.. ఏం జరిగిందంటే..!

Bengaluru

Bengaluru

దేశంలో పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. దీంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. చాలా చోట్ల కొట్లాటలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే డ్రైవర్లు, కండక్టర్లతో గొడవ పడిన దాఖాలు ఉన్నాయి. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఆపమన్న చోట బస్సు ఆపలేదని డ్రైవర్‌పై మహిళా ప్రయాణికులు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అంతే వేగంగా డ్రైవర్ కూడా రివర్స్ ఎటాక్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: NTR District: దారుణం.. ప్రేమ వ్యవహారం నచ్చక కూతుర్ని చంపిన తండ్రి

బెంగళూరులోని పీన్యా సమీపంలో తమకూరు రోడ్డులో బస్సు డ్రైవర్-మహిళా ప్రయాణికురాలి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం భౌతికదాడులకు పాల్పడ్డారు. మాటలతో మొదలైన గొడవ అనంతరం ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన గొడవను బయట నుంచి ఒక వ్యక్తి మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోలో మహిళా ప్రయాణికులకు సహాయంగా తోటి ప్రయాణికులు కూడా తోడయ్యారు. అనంతరం కండక్టర్ కలుగజేసుకుని ఇరువర్గాలను శాంతింప జేశాడు.

ఇది కూడా చదవండి: Off The Record: సిక్కోలు వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే..!!

 

Exit mobile version